గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగి గ్రామానికి చెందిన సుగ్గుల సాంబశివరావు (60) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సాంబశివరావు తెనాలిలోని నవీన లాడ్జిలో సోమవారం ఓ గదిని తీసుకున్నాడు.
రాత్రి నుంచి సాంబశివరావు గది నుంచి బయటకు రాకపోవటంపై అనుమానం వచ్చిన లాడ్జి సిబ్బంది.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మంచం మీద సాంబశివరావు మృతి చెందినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకోని మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.