ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నారాకోడూరులో విషాదం...రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి - guntur district crime news

కూరగాయలు కొనుగోలు చేసి ఇంటికి వెళ్లాలనుకున్న ఆ వృద్ధుడిని మృత్యువు కబళించింది. ద్విచక్రవాహనం ఢీ కొట్టడంతో స్వల్పగాయాలైన ఆ వ్యక్తిని ఆర్టీసీ బస్సు చిదిమేసింది. ఈ విషాద ఘటన గుంటూరు జిల్లా నారాకోడూరులో జరిగింది.

man died in a road accident in narakoduru guntur district
ఆర్టీసీ బస్సు ఢీ కొని వ్యక్తి

By

Published : Apr 10, 2021, 10:59 PM IST

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడూరులో వెంకటేశ్వరరావు అనే వ్యక్తి.. కూరగాయలు కొనుగోలు చేసేందుకు మార్కెట్​కు వెళ్లాడు. కూరగాయలు కొని తిరిగి ఇంటికి వెళ్తుండగా.. ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో వెంకటేశ్వరరావు కిందపడిపోయాడు. అదే సమయంలో అటుగా వస్తున్న ఆర్టీసీ బస్సు వెంకటేశ్వరరావు పైనుంచి వెళ్లింది. ఈ ప్రమాదంలో బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details