ఫిరంగిపురంలో శానిటైజర్ తాగి వ్యక్తి మృతి చెందాడు. పట్టణంలోని జెండా చెట్టు వీధిలో నివసిస్తున్న షేక్ అబ్దుల్ రషీద్ (40) మద్యానికి బానిస. ధరలు పెరిగిన కారణంగా.. మత్తు కోసం కొన్నాళ్లుగా శానిటైజర్ తాగాడు. అనారోగ్యానికి గురయ్యాడు. ఆదివారం రాత్రి శానిటైజర్ తాగి ఇంటికి చేరుకున్న అనంతరం కడుపు నొప్పితో బాధ పడ్డాడు.
శానిటైజర్ తాగి వ్యక్తి మృతి - sanitizer deaths at guntur
మద్యానికి బానిస అయ్యాడు. మత్తు కోసం శానిటైజర్ తాగి ప్రాణం మీదకు తెచ్చు కున్నాడు. చివరకు మరణించాడు.ఈ ఘటన గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో జరిగింది. ఈ ప్రాంతంలో.. ఇప్పటికి ఇద్దరు శానిటైజర్ తాగి మృతి చెందారు.
శానిటైజర్ తాగి వ్యక్తి మృతి
రషీద్ ను కుంటుంబ సభ్యులు ఫిరంగిపురంలో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆస్పపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రషీద్ సోమవారం మృతి చెందాడు. పంచనామా నిమిత్తం మృత దేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి తీసుకెళ్లారు. మృతుడి అన్న బాజిద్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.