గుంటూరు జిల్లా నకరికల్లు మండలంలోని గుంటూరు బ్రాంచ్ కెనాల్లో పడి గల్లంతైన పశుసంవర్ధక శాఖ ఏడీఏ కొలగాని ఏడుకొండలు మృతి చెందారు. ఆదివారం నకరికల్లు మండలంలోని అడ్డరోడ్డుకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా... మార్గమధ్యలో వాహనం అదుపుతప్పి గుంటూరు బ్రాంచ్ కెనాల్లో పడింది. ఈ ఘటనలో ఏడుకొండలు గల్లంతయ్యాడు. గమనించిన స్థానికులు... నకరికల్లు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికుల సహాయంతో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం దేచవరం వద్ద ఏడుకొండలు మృతదేహం లభ్యమైంది. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
శవమై తేలిన పశుసంవర్ధక శాఖ ఏడీఏ - గుంటూరు జిల్లా నేటి వార్తలు
గుంటూరు జిల్లా నకరికల్లు మండలంలోని గుంటూరు బ్రాంచ్ కెనాల్లో పడి గల్లంతైన పశుసంవర్ధక శాఖ ఏడీఏ కొలగాని ఏడుకొండలు మృతి చెందారు. దేచవరం వద్ద అతని మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కాలువలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
TAGGED:
man death in nakarikallu