గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం మందపాడుకు చెందిన సాంబయ్య.. వ్యవసాయ కూలీ పనులు చేస్తుంటాడు. మద్యానికి బానిసైన అతడు మద్యం మత్తులో పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు బాధితుడిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పురుగుల మందు తాగి వ్యక్తి మృతి - గుంటూరు జిల్లా నేర వార్తలు
అతడు వృత్తిరీత్యా వ్యవసాయ కూలీ. చిన్న చిన్న పనులు చేస్తూ బతుకు బండిని లాగుతున్నాడు. శారీరక శ్రమను మర్చిపోవడం కోసం మద్యం తాగడం అలవాటు చేసుకున్నాడు. ఆ అలవాటే క్రమంగా వ్యసనంగా మారింది. ఈ క్రమంలో మద్యం మత్తులో పురుగుల మందు తాగాడు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ విషాద ఘటన గుంటూరు జిల్లా మందపాడులో జరిగింది.
పురుగుల మందు తాగి వ్యక్తి మృతి