గుంటూరు జిల్లా చిలకలూరిపేట పాటిమీద ప్రాంతానికి చెందిన పుల్లంశెట్టి కోటేశ్వరరావు... జాతీయ రహదారి 16 పై ఒంగోలు బ్రిడ్జి దాటిన తర్వాత ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయానికి వెళ్లాడు. స్వామివారిని దర్శనం చేసుకుని ద్విచక్రవాహనంపై రోడ్డు దాటుతుండగా... ఒంగోలు వైపు వెళ్తున్న మినీ రవాణా వాహనం ఢీ కొట్టింది.
ఈ ఘటనలో కోటేశ్వరరావు తలకు తీవ్ర గాయమైంది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలిస్తుండగా దారిలో మృతిచెందాడు. స్థానిక ఎస్సై భాస్కర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.