ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్నేహితుల మధ్య ఘర్షణ... యువకుడు మృతి - గుంటూరు క్రైం న్యూస్

గుంటూరులో దారుణం జరిగింది. ఓ బార్​లో ఓ యువకుడిని తోటి స్నేహితులు కొట్టి హతమార్చారు. ఈ ఘటనకు పాల్పడిన ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

man dead on a attack in guntur
స్నేహితుల మధ్య ఘర్షణ... యువకుడు మృతి

By

Published : Mar 23, 2021, 5:00 AM IST

గుంటూరు కేవీపీ కాలనీలోని గెలాక్సీ బార్​లో గోపీనాథ్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. స్నేహితులతో కలసి బార్​కు వెళ్ళిన గోపీనాథ్​కు, అతని స్నేహితల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ క్రమంలో గోపీనాథ్​పై కర్రలతో దాడి చేయడంతో ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న నగరపాలెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు నగరంపాలెం సీఐ మల్లికార్జున రావు తెలిపారు. త్వరలోనే నిందితుల వివరాలను మీడియాకు వెల్లడిస్తామని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details