ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సుబ్బారెడ్డిపాలెంలో పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య - గుంటూరు జిల్లా వార్తలు

గుంటూరు జిల్లా మాచర్ల మండలం సుబ్బారెడ్డిపాలెంలో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బంధువులు అతన్ని మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు..అప్పటికే మృతి చెందినట్లు పేర్కొన్నారు.

Man commits suicide by drinking insecticide in Subbareddypalem
సుబ్బారెడ్డిపాలెంలో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య

By

Published : Mar 8, 2021, 1:47 PM IST

గుంటూరు జిల్లా మాచర్ల మండలం సుబ్బారెడ్డిపాలెేనికి చెందిన భట్టు ఆంజయ్య.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్న అతను ఆర్థిక ఇబ్బందులు.. ఇతర కారణాల వల్ల మనస్తాపానికి గురై ఇంట్లో పురుగుల మందు తాగాడు.

బంధువులు అతన్ని మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. అప్పటికే మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని పంచనామ నిమిత్తం మార్చురీకి తరలించారు. అంజయ్య ఆత్మహత్యకు గల కారణాలపై విజయపురి సౌత్ పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఇదీ చూడండి:ఘనంగా ఆటా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

ABOUT THE AUTHOR

...view details