గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన పులి శివయ్య(36) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. శివయ్యకు పదేళ్ల క్రితం తాడికొండ మండలం పొన్నెకల్లుకు చెందిన వెంకటేశ్వరమ్మతో వివాహం జరిగింది. వారికి 8 సంవత్సరాలు కుమార్తె, 7 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. ఆరు నెలలుగా భార్య, భర్తల మధ్య మనస్పర్థలు రావటంతో వెంకటేశ్వరమ్మ పొన్నెకల్లులోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఈక్రమంలో శివయ్య పొన్నెకల్లు వెళ్లి భార్యతో ఘర్షణ పడ్డాడు. భార్య తనతో రానందుకు పొన్నెకల్లు బైపాస్ వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటన స్థలానికి చేరుకున్న తాడికొండ ఎస్సై విజయ్‌కుమార్ రెడ్డి.. వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పొన్నెకల్లులో పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య - పురుగుల మందుతాగి వ్యక్తి ఆత్మహత్య
కుటుంబ కలహాల కారణంగా పురుగుల మందుతాగి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లు జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పొన్నెకల్లులో పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య