గుంటూరు జిల్లా రేపల్లె మండలం పెనుముడి బ్రిడ్జి పైనుంచి ఓ వ్యక్తి కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. చెరుకుపల్లికి చెందిన కట్ట కిరణ్ (27) శుక్రవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో నదిలోకి దుకాడు. బంధువుల ఫిర్యాదు మేరకు ఈరోజు తెల్లవారుజాము నుంచి పోలీసులు గజ ఈతగాళ్ళతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈరోజు సాయంత్రం మృతదేహన్ని వెలికి తీసిశారు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలే బలవన్మరణానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చరణ్ తెలిపారు.
కుటుంబ కలహాలతో.. కృష్ణానదిలో దూకి వ్యక్తి ఆత్మహత్య - krishna
పెనుముడి వారధి పైనుంచి ఓ వ్యక్తి కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలే బలవన్మరణానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
కృష్ణ నదిలోకి దూకి వ్యక్తి ఆత్మహత్య