గుంటూరు జిల్లా కర్లపాలెంలో నాగిరెడ్డి అనే వ్యక్తి సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశారు. ఉండడానికి ఇల్లు లేదని, తక్షణమే ఇంటిని మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈలోగా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, కుటుంబ సభ్యులు నాగిరెడ్డికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. డిప్యూటీ స్పీకర్ కోన రఘపతి వస్తేనే టవర్ దిగుతానని పట్టుబట్టాడు. చివరకు పోలీసులు నాగిరెడ్డితో సంప్రదింపులు జరిపి కిందకు దించారు. అనంతరం అదుపులోకి తీసుకున్నారు.
కర్లపాలెంలో సెల్‌టవర్ ఎక్కి వ్యక్తి హల్చల్ - guntur district news updates
గుంటూరు జిల్లా కర్లపాలెంలో ఓ వ్యక్తి సెల్‌టవర్ ఎక్కి హంగామా సృష్టించాడు. తాను నివాసం ఉండటానికి ఇల్లు లేదని.. తక్షణమే ఇంటిని మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
కర్లపాలెంలో సెల్‌టవర్ ఎక్కిన వ్యక్తి