గుంటూరు జిల్లా మోతుకురు గ్రామానికి చెందిన శ్రీనివాసరావు తన కూతురిని తెనాలికి చెందిన సుంకర శ్రీనివాసరావు అనే వ్యక్తితో వివాహం జరిపించారు. పెళ్లికి రూ.2లక్షల, బంగారు ఆభరణాలు కట్నకానుకలుగా ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తానని...నెలకు లక్ష రూపాయలు వస్తాయని మాయమాటలు చెప్పి తమ కుటుంబాన్ని నమ్మించాడని బాధితురాలి తండ్రి శ్రీనివాసరావు ఆరోపించారు. పెళ్లైన ఆరునెలలకే తమ కుమార్తెను వదిలి వెళ్లిపోయాడని... తనకు ఎటువంటి ఉద్యోగం లేదని శ్రీనివాసరావు తెలిపారు. తమకు న్యాయం చేయాలని జిల్లా రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేసిన లాభం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కూతురికి న్యాయం జరిగేలా చూడాలని స్పందన కార్యక్రమంలో...సమస్య తెలియజేశాడు ఆ తండ్రి.
ప్రభుత్వ ఉద్యోగమన్నాడు...వదలేసి వెళ్లిపోయాడు - గుంటూరులో మాయమాటలు చెప్పి వివాహం చేసుకున్న యువకుడు
తాను ఓ ప్రభుత్వ ఉద్యోగినని మాయమాటలు చెప్పి ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. వివాహం జరిగిన ఆరు నెలలకే విడిచి వెళ్లిపోయాడని యువతి తండ్రి ఆరోపిస్తున్నారు. తమ కూతురికి న్యాయం జరగాలని వేడుకుంటున్నాడు.
![ప్రభుత్వ ఉద్యోగమన్నాడు...వదలేసి వెళ్లిపోయాడు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5041356-64-5041356-1573561757256.jpg)
తమ కూతురికి న్యాయం జరగాలని వేడుకుంటున్న బాధితురాలి తండ్రి
తమ కూతురికి న్యాయం జరగాలని వేడుకుంటున్న బాధితురాలి తండ్రి