గుంటూరు జిల్లా వేమూరుకు చెందిన దాసరి ఉమామహేశ్వర రావు ఓ యువతిని ఏడాదిగా ప్రేమిస్తున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. కొద్ది రోజులుగా యువతి.. పెళ్లి చేసుకొవాలంటూ ఒత్తిడి చేయటంతో సొంత కారులో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఇంట్లో వాళ్లు ఒప్పుకోవటం లేదని.. కలిసి చనిపోదామని నమ్మబలికాడు. ముందే తెచ్చుకున్న పురుగుల మందును.. మెుదట ఆమెతో తాగించి తాను తప్పుకున్నాడు. ఇంతలో అటుగా వెళ్తున్న గ్రామస్థులు గమనించి ఏం చేస్తున్నారని ప్రశ్నించటంతో.. అక్కడ్నుంచి అతగాడు పరారయ్యాడు. గ్రామస్థులు యువతిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
Love Cheating: ప్రేమ పేరుతో మోసం.. ఆత్మహత్య పేరిట యువతిని చంపేందుకు యత్నం
ప్రేమించానన్నాడు.. కలకాలం కలిసుందామని నమ్మబలికాడు. పెళ్లి చేసుకొమ్మని యువతి.. గట్టిగా అడిగేసరికి.. ఇకలాభం లేదు అడ్డు తొలగించుకొవాలనుకున్నాడు. కన్నవారు కాదంటున్నారంటూ.. యువతిని నమ్మబలికి ఆత్మహత్య చేసుకుందామంటూ ఆమెను చంపబోయాడు. ఈ నయవంచన ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
ప్రేమ పేరుతో మోసం
ఉమామహేశ్వర రావుకు గతంలోనూ రెండు వివాహాలు అయ్యాయని పోలీసులు చెప్పారు. ప్రేమ పేరుతో ఇలా స్థానికంగా మరికొంత మంది అమ్మాయిలను మోసగించినట్లు తెలిపారు. అయితే ఈ విషయం తనకు తెలియదని బాధితురాలు వివరించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండీ..inter exam results: ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల..