గుంటూరు జిల్లా పెదకాకాని పోలీసులకు ఓ సమాచారం వచ్చింది... రామచంద్రపాలెం వెళ్లే రోడ్డులోని ఓమొక్కజొన్న చేలో మృతదేహం ఉందన్నది దాని సారాంశం. జాగిలాలతో పాటు అక్కడకు వెళ్లిన పోలీసులు చుట్టుపక్కల పరిసరాలు పరిశీలించారు. చనిపోయిందెవరో తెలుసుకునే ప్రయత్నంలో మృతదేహాన్ని పరిశీలించి.. ఖంగుతిన్నారు. నిశితంగా పరిశీలిస్తే..ఆ మృతదేహానికి ఓ చెయ్యి లేదు ఎవరో నరికినట్లు ఆనవాళ్లున్నాయి. ఆ చెయ్యి ఎక్కడుందో వెతికేందుకు జాగిలాలను వదిలారు. జొన్నచేను జల్లెడపట్టారు..
మృతదేహం ఎవరిది? ఎవరు చంపి ఉంటారు..? అతను చెయ్యి ఎందుకు నరికారు..?అసలు ఆ చెయ్యి ఎక్కడుందన్నవి పోలీసుల ముందున్న ప్రశ్నలు. వీటిని చేధించే క్రమంలోనే వారికి నల్లపాడు పోలీసుల నుంచి ఓ సమాచారం వచ్చింది. మంగళవారం అర్ధరాత్రి నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ లారీని తనిఖీ చేయగా అందులో అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తి వద్ద సంచి గుర్తించామని, దాన్ని పరిశీలిస్తే అందులో చేయి ఉందన్నది దాని సారాంశం. లారీ డ్రైవర్, క్లీనర్‌తోపాటు సదరు వ్యక్తినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హత్యకు కారణాలు ఏంటి..?