ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చేబ్రోలులో ఒడిశాకు చెందిన వ్యక్తి దారుణ హత్య - గుంటూరులోని చేబ్రోలులో ఒడిశాకు చెందిన వ్యక్తి దారుణ హత్య తాజా వార్తలు

స్పిన్నింగ్ మిల్లు కార్మికుడిగా పనిచేస్తున్న ఒడిశాకు చెందిన వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడూరు గ్రామంలో జరిగింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

man belonged to orissa has been murdered at chebrolu in guntur
చేబ్రోలులో ఒడిశాకు చెందిన వ్యక్తి దారుణ హత్య

By

Published : Mar 16, 2021, 4:57 PM IST

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడూరులో ఒడిశాకు చెందిన వ్యక్తిని.. దుండగులు దారుణంగా హత్య చేశారు. అజిత్‌ రహ్వా అనే వ్యక్తి కొంత కాలంగా ఓ స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తున్నాడు. కుటుంబంతో సహా అక్కడే జీవిస్తున్నాడు. రాత్రి నుంచి అజిత్‌ కనిపించకపోవడంతో.. ఆచూకి కోసం కుటుంబ సభ్యులు వెతికారు. ఇవాళ ఉదయం మిల్లుకు వెళ్లేదారిలో రక్తపుమడుగులో పడి ఉన్నాడు. విగతజీవుడిగా పడి ఉన్న అజిత్​ను చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాత కక్షలతో హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి:

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details