ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్యాయత్నం - తాడికొండ వార్తలు

భార్య కాపురానికి రాలేదని మనస్థాపంతో గుంటూరు జిల్లా తాడికొండకు చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. ఇటీవల ఓ విషయంలో భార్యభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో వివాహిత పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య ఇంటికి రావడంలేదని పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడని అతని బంధువులు తెలిపారు.

Man attempted suicide
Man attempted suicide

By

Published : Dec 11, 2020, 10:06 AM IST

భార్య కాపురానికి రాలేదనే మనస్థాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించిన ఘటన గుంటూరు తాడికొండ గ్రామంలో జరిగింది. తాడికొండకు చెందిన పేర్ల పూర్ణచంద్రరావు స్థానికంగా వస్త్ర దుకాణం నడువుతుంటారు. 10 ఏళ్ల కిందట గుంటూరు నగరానికి చెందిన యువతితో వివాహం జరిగింది. ఇటీవల ఒక విషయంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో వివాహిత తన పుట్టింటికి వెళ్లిపోయారు.

కాపురానికి రమ్మని పూర్ణచంద్రరావు పిలిచినా ఆమె నిరాకరించిందని బంధువులు తెలిపారు. దీంతో మనస్థాపం చెందిన పూర్ణచంద్రరావు గురువారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పెట్రోల్ పోసుకుని నిప్పు పెట్టుకున్నారు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు...మంటలు ఆర్పి ఆయన్ను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details