ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాచర్లలో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్ - guntoor dist latest news

తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని మాచర్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి నుంచి రూ.లక్ష యాభై వేల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. లాక్డ్ హౌస్ మేనేజింగ్ సిస్టమ్​ను వినియోగించుకోవాలని స్థానిక ప్రజలకు పోలీసులు సూచించారు.

man-arrested-for-robbery-
మాచర్లపట్టణంలో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

By

Published : Nov 11, 2020, 11:01 PM IST

గుంటూరు జిల్లా మాచర్లలో చోరీలకు పాల్పడుతున్న మట్టపల్లి హరిబాబు అలియాస్ కమ్మ కాశీ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.లక్ష యాభై వేల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని పట్టణ సీఐ రాజేశ్వరరావు తెలిపారు. నిందితుడు ఈ నెల 2న మాచర్లలోని 20వ వార్డులో ఎవరూ లేని ఇంట్లోకి చొరబడి బంగారు ఆభరణాలతో పాటు రూ.9వేల నగదు చోరీ చేశాడని వివరించారు.

బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామని, పట్టణ శివారులోని రింగు రోడ్డు వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఎక్కడికైనా వెళ్లేముందు పోలీసులకు సమాచారం అందిస్తే లాక్డ్ హౌస్ మేనేజింగ్ సిస్టమ్ ద్వారా భద్రత కల్పిస్తామని స్థానికులకు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details