ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శుభకార్యానికి వచ్చాడు... బంగారం దోచుకెళ్లాడు - చిలకలూరిపేట లో దొంగ అరెస్టు

బంధువుల ఇంటికి కన్నం వేసిన ఓ ప్రబుద్ధుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 153 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో జరిగింది.

man arrested by police in chilakalooripeta guntur district
పోలీసుల అదుపులో నిందితుడు

By

Published : Sep 28, 2020, 5:19 PM IST

గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన అబ్దుల్ రహీం... తన ఇంట్లో శుభకార్యం నిర్వహిస్తున్న సమయంలో భారీ చోరీ జరిగింది. రహీం మేనకోడలి భర్త... అలీ హర్మస్ కార్యక్రమానికి హాజరయ్యాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అదును చూసిన అలీ.. బీరువాలో ఉన్న 153 గ్రాముల బంగారు ఆభరణాలను అపహరించాడు.

సాయంత్రం సమయంలో అబ్దుల్ రహీం కుటుంబ సభ్యులు బీరువాను తెరిచి చూడగా నగలు కనిపించలేదు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. శుభ కార్యానికి హాజరైన వారి వివరాలు సేకరించారు. చివరికి.. అలీ హర్మాస్ ను నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details