mammography-service-in-guntur: ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని వచ్చే ఏడాది ఉగాదిన రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రారంభిస్తారని వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజని వెల్లడించారు. జీజీహెచ్ నాట్కో కేంద్రంలో గడ్డిపాటి కస్తూరిదేవి, రామమోహన్రావు, శివరామకృష్ణ సౌజన్యంతో ఏర్పాటు చేసిన డిజిటల్ మామోగ్రాఫి పరికరాన్ని ఆమె ప్రారంభించారు. బ్రెస్ట్ క్యాన్సర్‌ను ముందే గుర్తించే మామోగ్రఫీ పరికరం రాష్ట్రంలో మొదటిసారిగా గుంటూరు జీజీహెచ్‌లో అందుబాటులోకి వచ్చిందని మంత్రి రజని చెప్పారు. విశాఖలో క్యాన్సర్ చికిత్సలకు హోమీ బాబా ఆసుపత్రితో ఒప్పందం చేసుకున్నామని, క్యాన్సర్ వైద్యం కోసం బయట రాష్ట్రాలకు వెళ్లకూడదన్న లక్ష్యంతో పని చేస్తున్నామని అన్నారు.
గుంటూరు జీజీహెచ్‌లో మమోగ్రఫీ సేవలు ప్రారంభం - mammography test for finding breast cancer
mammography service in guntur: క్యాన్సర్ వైద్యం కోసం బయట రాష్ట్రాలకు వెళ్లకుండా బ్రెస్ట్ క్యాన్సర్‌ని గుర్తించే డిజిటల్ మమోగ్రఫీ పరికరాన్ని రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా గుంటూరు జీజీహెచ్‌లో అందుబాటులోకి వచ్చిందని వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజని వెల్లడించారు. వచ్చే ఏడాది ఉగాదిన రాష్ట్రంలో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేతులమీదుగా ప్రారంభించనున్నారు.
వచ్చే ఉగాది నుంచి రాష్ట్రంలో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం