విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ ఘటన పై .. ప్రజలను భయబ్రాంతులకు గురి చేశారన్న ఆరోపణలపై హైదరాబాద్కి చెందిన మల్లాది రఘునాథ్ సీఐడీ విచారణకి హాజరయ్యారు. గుంటూరులోని ప్రాంతీయ సీఐడీ కార్యాలయానికి తన లాయర్ హరిబాబు తో కలసి రఘుబాబు వచ్చారు. గతంలో ఇదే కేసుకు సంబంధించి గుంటూరుకి చెందిన వృద్ధ మహిళ రంగనాయకమ్మ విచారణ హాజరుకాగా, రఘునాథ్ రెండోవారుసామజిక మాధ్యమాలలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా దురుద్దేశపూర్వకంగా ఎందుకు పోస్టులు పెట్టాల్సి వచ్చిందో.. దీని వెనుక కారణాలు ఏంటో చెప్పాలని సీఐడీ అధికారాలు ప్రశ్నించారని సమాచారం. వివిధ అంశాలు పై సీఐడీ విచారణ సుధీర్ఘంగా కొనసాగుతుంది .
సీఐడీ విచారణకు హాజరైన మల్లాది రఘునాథ్ - సీఐడీ విచారణకు మల్లాది రఘు
ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారని మల్లాది రఘునాథ్పై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై విచారణకు గుంటూర ప్రాంతీయ సీఐడీ కార్యాలయానికి మల్లాది రఘునాథ్ హాజరయ్యారు.
సీఐడీ విచారణకు మల్లాది రఘు