ఎల్జీ పాలిమర్స్ ఘటనపై రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టారని రఘునాథ్ బాబుపై సీఐడీ అభియోగం మోపింది. ఏకంగా 8 గంటలపాటు సీఐడీ విచారణ సాగింది. రఘునాథ్‌బాబు నుంచి స్టేట్మెంట్ను అధికారులు నమోదు చేశారు. మళ్లీ విచారణకు పిలుస్తామని అధికారులు చెప్పినట్లు రఘునాథ్ తెలిపారు. వివాదాస్పద పోస్టులు పెట్టడం వెనుక ఉద్దేశంపై సీఐడీ ఆరా తీసిందని చెప్పారు. ఇదే కేసులో ఇప్పటికే సీఐడీ విచారణను రంగనాయకమ్మ ఎదుర్కొంటున్నారు.
ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాల్జేయడం నా ఉద్దేశం కాదు: రఘునాథ్ - ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ న్యూస్
సీఐడీ ఎదుట రఘునాథ్‌బాబు విచారణ ముగిసింది. ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాల్జేయడం తన ఉద్దేశం కాదని.. మల్లాది రఘునాథ్ అన్నారు.
malladhi raghunath about cid enquiry