కేసీఆర్‌కు అమరావతి అభివృద్ధి భయం: సీఎం
కరుడుగట్టిన నేరస్తుడు జగన్.. కాపలాగా మోదీ! - chandrababu
గుంటూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేశారు. ప్రధాని మోదీ, వైకాపా అధ్యక్షుడు జగన్‌లపై సీఎం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అమరావతి అభివృద్ధి చెందుతోందనే.. కేసీఆర్‌కు భయం పట్టుకుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

అమరావతి అభివృద్ధి చెందుతోందని కేసీఆర్‌కు భయం పట్టుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. పొరుగు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలిని తప్పుబట్టారు. అమరావతి ప్రపంచ 5 అగ్రశ్రేణి నగరాల్లో ఒకటిగా ఉండబోతోందని చెప్పారు. హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు రూ.5 వేల కోట్ల విద్యుత్ బకాయి ఉందని చెప్పారు. ఆ డబ్బులు అడిగితే.. తిరిగి మనమే ఇవ్వాలని అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి మోదీ, కేసీఆర్, జగన్ బెంబేలెత్తుతున్నారని ఎద్దేవా చేశారు. అహ్మదాబాద్‌ను మించి అమరావతి అభివృద్ధి చెందుతుందేమో అని మోదీ భయపడుతున్నారని అన్నారు.