రాష్ట్రంలో మాల, మాదిగల మధ్య చిచ్చుపెట్టిన మందకృష్ణ మాదిగ.. నేడు గుంటూరు వచ్చి సమయమనం పాటించాలని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నవరపు కిషోర్ అన్నారు. వెలగపూడిలో స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఎంపీ సురేష్ ఆధ్వర్యంలో దాడి జరిగితే ఆయన ఎందుకు స్పందిచలేదని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు నోటాకి ఓటు వేయమని చెప్పిన మందకృష్ణ మాదిగ.. నేడు మాదిగలకు అన్యాయం జరుగుతుందని మాట్లాడం దారుణమన్నారు. వైకాపాలో మాదిగలకు అన్యాయం జరుగుతుందని గగ్గోలు పెడుతున్న తెదేపా నేత వర్ల రామయ్య.. దళితుల మధ్య మరింత చిచ్చుపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
'మందకృష్ణ మాదిగ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి' - గుంటూరు జిల్లా తాజా వార్తలు
గుంటూరులో మందకృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యలపై మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నవరపు కిషోర్ మండిపడ్డారు. మాల మాదిగల మధ్య చిచ్చుపెట్టిన మందకృష్ణ మాదిగ.. నేడు గుంటూరు వచ్చి సమయమనం పాటించాలని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. వెలగపూడిలో స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఎంపీ సురేష్ ఆధ్వర్యంలో దాడి జరిగితే మందకృష్ణ ఎందుకు స్పందించలేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

మాలమహనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నవరపు కిషోర్