ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాఠశాలల్లోనే ప్రీప్రైమరీ బోధన: సీఎం జగన్

పాఠశాలల తరహాలోనే అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ 10 రకాల సదుపాయాలు కల్పించాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్​మోహన్ రెడ్డి ఆదేశించారు. ప్రీ ప్రైమరీ-1, ప్రీ ప్రైమరీ- 2లను పాఠశాలల్లో చదివేలా మార్పులు చేయాలని సూచించారు.

cm jagan
cm jagan

By

Published : Jul 23, 2020, 4:23 PM IST

పాఠశాలల్లోనే ప్రీప్రైమరీ(పీపీ) బోధన ఉంటే బాగుంటుందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. పీపీ1, పీపీ2లను పాఠశాలల్లోనే చదివేలా మార్పులు చేయాలని అధికారులకు సూచించారు. సిలబస్‌పైనా పరిశీలన చేయాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో నాడు- నేడు, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు.

'అంగన్‌వాడీ కేంద్రాల్లో నాడు-నేడు కార్యక్రమాలు చేపట్టాలి. పది రోజుల్లో కార్యాచరణలోకి తీసుకురావాలి. పాఠశాలల తరహాలోనే అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ 10 రకాల సదుపాయాలు కల్పించాలి. అంగన్‌వాడీ కేంద్రాల కార్యకలాపాలను మరింత పటిష్టం చేయాలి. గర్భిణీలు, బాలింతలు, 36 నెలల్లోపు శిశువులకు ఒకలా కార్యకలాపాలు ఉండాలి. 36 నెలలు నుంచి 72 నెలల పిల్లలను మరో విధంగా చూడాల్సి ఉంటుంది. అంగన్‌వాడీ పిల్లల్లో అభ్యాస నైపుణ్యాల కోసం బొమ్మలు, టీవీ, ప్రత్యేక పుస్తకాలు ఏర్పాటు చేయండి. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆహారం ఎక్కడ తిన్నా ఒకే నాణ్యతతో ఉండాలి. ప్రసవం కాగానే మహిళలకు రూ.5 వేలు ఆరోగ్య ఆసరా కింద అందించేలా చూడండి. వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ అమలు తీరుపై బలమైన పర్యవేక్షణ ఉండాలి' అని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details