గుంటూరు రైల్వే డివిజన్లోని ఉద్యోగుల కోసం కోచ్ విభాగంలో పనిచేసే సిబ్బందితోనే శానిటైజర్లు, మాస్కులు తయారు చేయించి.. వాటిని ఉద్యోగులందరికీ అందజేస్తున్నారు. మార్కెట్లో వాటి లోటు సమస్యను అధిగమించేందుకు సొంతగానే తయారిని ప్రారంభించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే సిబ్బంది తరచుగా చేతులు శుభ్రం చేసుకునేందుకు వీలుగా పెడల్ శానిటైజర్ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. చేతులతో పనిలేకుండా కాళ్లతో నొక్కితే హ్యాండ్ వాష్, నీరు వచ్చేలా ఈ పరికరాన్ని రూపొందించారు.
రైల్వే ఉద్యోగుల కోసం.. నిర్వహణ సిబ్బంది మాస్కుల తయారీ - lockdown in guntur
కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ మార్కెట్లో శానిటైజర్ల కొరత ఏర్పడింది. గుంటూరు రైల్వే డివిజన్లోని ఉద్యోగుల కోసం... నిర్వహణ విభాగంలోని సిబ్బంది శానిటైజర్లు, మాస్కులు తయారుచేస్తున్నారు.

గుంటూరు రైల్వే నిర్వహణ సిబ్బంది మాస్కుల తయారీ