కరోనా నేపథ్యంలో సొంతూళ్లకు చేరడానికి 3 రోజులుగా నడిచి వస్తున్న వలసకూలీలను పోలీసులు అడ్డుకున్నారు. వారిని వెంటనే మినీ వాహనంలో తిరిగి వారు బయలు దేరిన చోటుకు తరలించారు. కూలీ పనుల కోసం గుంటూరు జిల్లాకు వచ్చిన వలసకూలీలు లాక్‌డౌన్ నేపథ్యంలో తాడికొండ మండలం రావెలలో ఉండిపోయారు.
వీరు సొంతూరు నంద్యాలకు వెళ్లడానికి తలపై వంట సామగ్రితో మూడురోజుల క్రితం బయల్దేరారు. తిప్పలు పడి బుధవారం గుంటూరు జిల్లా సరిహద్దు నరసరావుపేట మండలంలోని లక్ష్మీపురం చెక్‌పోస్టు వద్దకు చేరుకోగానే అక్కడ విధులు నిర్వహిస్తున్న మహిళా ఎస్సై వారిపై కారాలు మిరియాలు నూరారు.