అహింసా వాదంతో మహాత్మా గాంధీ స్వాతంత్య్రాన్ని తీసుకొస్తే... ప్రధాని మోదీ నియంతృత్వ పాలన చేస్తున్నారన్నారని కాంగ్రెస్ నేత మస్తాన్ వలీ అన్నారు. గుంటూరు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వ్యవసాయ బిల్లుల ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతులను మభ్యపెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. అందులో భాగంగా సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.
'ప్రధాని మోదీ నియంతృత్వ పాలన చేస్తున్నారు' - గుంటూరులో సమావేసం
కేంద్ర ప్రభుత్వ వైఖరిపై కాంగ్రెస్ నేత మస్తాన్ వలీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మహాత్మాగాంధీ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
గుంటూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశం