Mahashakti Awareness Program: గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో మహాశక్తి అవగాహన కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అన్ని నియోజకవర్గాల్లోని మహిళలు పెద్ద ఎత్తున వచ్చారు. మేనిఫెస్టోలో మహిళల కోసం పొందుపర్చిన ప్రతి అంశాన్ని తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసి చూపుతుందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తోందని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత స్పష్టం చేశారు. మహాశక్తి వీడియోను తెలుగు మహిళలు విడుదల చేశారు. మహిళలకు చంద్రబాబు ప్రకటించిన వరాలు వారి భవిష్యత్‌కు బంగారు బాటలు వేయబోతున్నాయని.. వెల్లడించారు.
TDP Leader Anitha Fires on YSRCP: తెలుగుదేశం పార్టీ వల్లే మహిళలకు ఆస్తిలో సమాన హక్కు లభించిందని వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్ సతీమణి భారతీ రెడ్డి, సోదరి షర్మిలకు ఆస్తులు వచ్చాయంటే అది తెలుగుదేశం పార్టీ వల్లేనని ఉద్ఘాటించారు. తెలుగుదేశం పార్టీ ఆస్తిలో సమాన హక్కు కల్పిస్తే, జగన్మోహన్ రెడ్డి తన ఇంటి మనుషుల్ని కూడా వంచించాడని ఆక్షేపించారు. సంక్షేమానికి కాపీ రైట్ తెలుగుదేశం పార్టీ అని అనిత తేల్చిచెప్పారు. సైకో పాలనలో ఎంతోమంది మహిళలు దగా పడ్డారని మండిపడ్డారు. మహిళలకు ప్రకటించిన పథకాలతో 7 వేల గ్రామాల్లో ప్రచారం చేస్తామని, 20 లక్షల మంది మహిళలను కలుసుకునేలా రథయాత్ర జరుగుతుందని తెలిపారు.