మహానటి సావిత్రి వర్ధంతి సందర్భంగా ఆమె స్వగ్రామమైన వడ్డేవారిపాలెంలో ఆమె చిత్రపటానికి నివాళులు అర్పించారు. సావిత్రి ఆర్థిక సాయంతో నిర్మించిన సావిత్రి గణేషన్ ఉన్నత పాఠశాలలో మహానటి విగ్రహానికి పూలమాలలు వేశారు. విద్యాభివృద్ధి కోసం సావిత్రి ఎనలేని కృషి చేశారని జనసేన నేతలు కొనియాడారు. తీర ప్రాంతంలో విద్యార్థులకు చదువు అందించాలనే ఉద్దేశంతో... పాఠశాలను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు.
'మహానటి... విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేశారు' - mahanati death anniversary
మహానటి సావిత్రి వర్ధంతి సందర్భంగా గుంటూరు జిల్లాలో జనసేన నేతలు ఆమె చిత్రపటానికి నివాళులు అర్పించారు. విద్యాభివృద్ధి కోసం సావిత్రి చేసిన కృషిని కొనియాడారు.
'మహానటి విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేశారు'