అమ్మ జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి : సావిత్రి కుమార్తె - guntur film news
పకృతి ఒడిలో పిల్లలు విద్యనభ్యసించటం వారి అదృష్టమని మహానటి చిత్ర నిర్మాత ప్రియాంకదత్ అన్నారు. గుంటూరు జిల్లా వడ్డెవారిపాలెంలోని సావిత్రి గణేష్ పాఠశాలను ఆమె సందర్శించారు.
ప్రియాంక దత్
మహానటి సావిత్రి గారు కట్టించిన పాఠశాలకు రావడం ఆనందంగా ఉందని నిర్మాత ప్రియాంకదత్ తెలిపారు. గుంటూరు జిల్లా రేపల్లె మండలం వడ్డెవారిపాలెంలోని సావిత్రి గణేష్ ఉన్నత పాఠశాలకు ఆమె బస్సును విరాళంగా ఇచ్చారు. మహానటి చిత్రపటానికి సావిత్రి కుమార్తె విజయచాముండేశ్వరితో కలిసి నివాళులర్పించారు. అనంతరం బస్సు సేవలను ప్రారంభించారు. విద్యార్థులకు అన్ని రంగాల్లో చేయూతనిస్తామన్నారు.