మహా శివరాత్రిని పురస్కరించుకుని అమరావతిలో అమరలింగేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే స్వామికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకొనేందుకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసామని ఆలయ ఈవో సునీల్‌కుమార్ తెలిపారు. ఈ రాజు రాత్రి ఒంటి గంట నుంచి 5గంటల వరకు అమరలింగేశ్వరస్వామి కల్యాణోత్సవం జరపనున్నారు.
అమరలింగేశ్వరుడి కల్యాణోత్సవం - పంచారామా క్షేత్రాల్లో ప్రథమ ఆలయం వార్తలు
పంచారామా క్షేత్రాల్లో ప్రథమ ఆలయమైన గుంటూరు జిల్లా అమరావతిలోని అమరలింగేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శివరాత్రి సందర్భంగా స్వామికి పంచామృతాభిషేకాలు చేశారు. రాత్రి ఒంటి గంట నుంచి 5 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం జరగనుంది.
![అమరలింగేశ్వరుడి కల్యాణోత్సవం Maha Shivaratri in Amaralingeswara swamy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6150377-532-6150377-1582270423724.jpg)
అమరావతిలో అమరలింగేశ్వరస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు
అమరావతిలో అమరలింగేశ్వరస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు
ఇవీ చూడండి...