గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలోని శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ క్షీర భావనారాయణ స్వామి ఆలయంలో... అష్ట బంధన సంప్రోక్షణ మహా కుంభాభిషేకం మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయ జీర్ణోద్ధరణలో భాగంగా నిర్వాహకులు అష్ట బంధన మహాకుంభాభిషేకం నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా సంకల్ప పూజ, పుణ్యాహవచనం, కలశ స్థాపన, కలశపూజ వైదిక క్రతువులను పూర్తి చేశారు. యాగశాలలో ఏర్పాటు చేసిన హోమగుండంలో వేద పండితులు శాస్త్రోక్తంగా యాగం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామిపై గానం చేసిన కీర్తనల సీడీని ఉప సభాపతి ఆవిష్కరించారు.
బాపట్ల భావనారాయణ స్వామి ఆలయంలో ఘనంగా కుంభాభిషేకం - శ్రీ క్షీర భావనారాయణ స్వామి ఆలయంలో మహా కుంభాభిషేకం
గుంటూరు జిల్లా బాపట్లలోని శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ క్షీర భావనారాయణ స్వామి ఆలయంలో... మహా కుంభాభిషేకం మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి దంపతులు పాల్గొన్నారు.

శ్రీ క్షీర భావనారాయణ స్వామి ఆలయంలో మహా కుంభాభిషేకం
శ్రీ క్షీర భావనారాయణ స్వామి ఆలయంలో మహా కుంభాభిషేకం
ఇదీ చదవండి: