ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇన్​చార్జ్​ వీసీగా బాధ్యతలు చేపట్టిన మధుసూధనరెడ్డి - Madhusudhan Reddy as Vice Chancellor of Acharya Nga Ranga Agricultural University

ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇంఛార్జ్ ఉప కులపతిగా మధుసూధనరెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఆయన బాధ్యతలు స్వీకరించారు.

guntur district
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇంఛార్జ్ ఉప కులపతిగా మధుసూధనరెడ్డి

By

Published : Jun 6, 2020, 3:19 PM IST

ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇంఛార్జ్ ఉప కులపతిగా మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి మధుసూధనరెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఆయన బాధ్యతలు స్వీకరించారు. గతంలో వీసీగా ఉన్న దామోదరనాయుడు పదవి కాలం ముగియడంతో.. మధుసూధనరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. మధుసూధనరెడ్డి 1990 బ్యాచ్​కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి.

రాష్ట్రంలో వ్యవసాయ విద్య, పరిశోధనలు, విస్తరణ కార్యక్రమాలకు సంబంధించి వ్యవసాయ విశ్వవిద్యాలయం కీలక భూమిక పోషిస్తోంది. దీని పరిధిలోనే వ్యవసాయ కళాశాలలు, వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజిలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, వ్యవసాయ పరిశోధనా కేంద్రాలు పని చేస్తున్నాయి.


ఇది చదవండి 19 నుంచి బడ్జెట్ సమావేశాలు?

ABOUT THE AUTHOR

...view details