గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్... తెదేపా అధినేత చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలిస్తే 12గంటల వ్యవధిలోనే ఇన్ఛార్జిని నియమిస్తారా... అని ప్రశ్నించారు. గన్నవరంలో వల్లభనేని వంశీ పార్టీకి దూరంగా ఉండి 3నెలలు అవుతుంది. ఇప్పటివరకూ అక్కడ ఇన్ఛార్జినిను నియమించలేదని గుర్తుచేశారు. వంశీకో న్యాయం... నాకో న్యాయమా..?అని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక వర్గాలపై తెదేపా చిన్నచూపు చూస్తోందని మద్దాలి గిరి ఆరోపించారు. చంద్రబాబు సమాధానం చెప్పాలని మాద్దాలి గిరి డిమాండ్ చేశారు.
'వంశీకో న్యాయం... నాకో న్యాయమా..?' - చంద్రబాబుకు బహిరంగ లేఖ రాసిన మద్దాలి గిరిధర్
ఇటీవల ముఖ్యమంత్రి జగన్ను కలిసిన ఎమ్మెల్యే మద్దాల గిరికి తెదేపా షాక్ ఇచ్చింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి కొత్త ఇన్ఛార్జిని నియమించింది. దీనిపై మద్దాలి గిరి స్పందించారు. తెదేపా అధినేత చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు.
చంద్రబాబుకు బహిరంగ లేఖ రాసిన మద్దాలి గిరిధర్