గుంటూరు జిల్లా శ్యామలానగర్‌లో పిచ్చికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. శ్యామలానగర్ 2, 10వ లైన్లలో శునకాల దాడిలో 8 మంది చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. గాయాలపాలైన చిన్నారులను పట్టాభిపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ నెలలో ఇది రెండవ ఘటన కావటంతో స్థానికులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పురపాలక అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని తమను కుక్కల బారి నుంచి రక్షించాలని వేడుకుంటున్నారు.
పిచ్చికుక్కల దాడిలో ఎనిమిది మంది చిన్నారులకు గాయాలు - గుంటూరులో పిచ్చికుక్కలు దాడి తాజా వార్తలు
పిచ్చి కుక్కల దాడిలో 8 మంది చిన్నారులు గాయపడిన ఘటన గుంటూరు జిల్లా శ్యామలా నగర్‌లో జరిగింది. ఈ నెలలో ఇది రెండో ఘటన. శునకాల స్వైరవిహారంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పురపాలక అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
8మంది చిన్నారులపై పిచ్చికుక్కలు దాడి..