ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విధుల నుంచి మాచర్ల సీఐ రాజేశ్వరరావు రిలీవ్ - మాచర్ల సీఐ రాజేశ్వరరావును విధుల నుంచి రిలీవ్

మాచర్ల సీఐ రాజేశ్వరరావును విధుల నుంచి రిలీవ్ చేస్తూ.. ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ సీఐ భక్తవత్సల రెడ్డికి మాచర్ల ఇన్​ఛార్జి బాధ్యతలు అప్పగించారు.

ci rajeshwara Rao relieve from duties
మాచర్ల సీఐ రాజేశ్వరరావును విధుల నుంచి రిలీవ్

By

Published : Jan 27, 2021, 9:46 PM IST

Updated : Jan 28, 2021, 10:14 AM IST

గుంటూరు జిల్లా మాచర్ల పట్టణ సీఐ రాజేశ్వరరావు విధుల నుంచి రిలీవ్ అయ్యారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్​లో రిపోర్ట్ చేయాలని ఆయన్ను ఆదేశించినట్లు తెలిసింది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈసీ ఆదేశాల మేరకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. గత ఎన్నికల సమయంలో ఆయనపై ఎన్నికల అధికారి చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. గ్రామీణ సీఐ భక్త వత్సల రెడ్డి.. ప్రస్తుతం ఇన్​ఛార్జిగా వ్యవహరించనున్నారు.

Last Updated : Jan 28, 2021, 10:14 AM IST

ABOUT THE AUTHOR

...view details