Lumpy skin disease in Guntur: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ప్రాతూరులో సుమారు 26 పశువులకు లంపి వైరస్ లక్షణాలు సోకినట్లు పశు వైద్యులు వెల్లడించారు. మండలంలో 26 పశువులకు వైరస్ లక్షణాలు ఉండటంతో.. గోపాల్ మిత్ర సహాయంతో వాటికి టీకాలు వేశారు. ప్రాతూరులోని ఎస్సీ కాలనీలో ఆవులకు లంబి వైరస్ లక్షణాలు బయటపడటంతో.. వాటి కాపర్లు ఆందోళన వ్యక్తం చేశారు. కాల్ సెంటర్కు సమాచారం ఇచ్చినా.. ఎవరూ రాలేదని గ్రామస్థులు వాపోయారు. ఆవులలో వైరస్ లక్షణాలు ముదిరి చర్మం పండ్లు పడే స్థాయికి చేరుకున్నాయని వాటి యజమానులు చెప్పారు. దీంతో అప్రమత్తమైన తాడేపల్లి పశు వైద్య అధికారులు మండలంలో ఉన్న ఆవులకు గోపాల మిత్రల ద్వారా వ్యాక్సిన్ వేయిస్తున్నారు.
గుంటూరులో లంపి వైరస్ విజృంభణ.. పాడి రైతుల్లో ఆందోళన - Lumpy skin disease in AP
Lumpy skin disease in AP: తాడేపల్లిలో సుమారు 26 పశువులు లంపి వైరస్ బారినపడ్డాయి. అధికారులు లేటుగా స్పందించడంతో వ్యాధి తీవ్రత పెరిగినట్లు పశువుల యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం మండలంలోని వివిధ గ్రామాల్లో తిరుగుతూ పశువలకు వ్యాక్సిన్లు వేస్తున్నారు.
లంపి వైరస్
Last Updated : Oct 27, 2022, 4:43 PM IST