గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో చెట్టుకు ఉరేసుకుని ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. సత్తెనపల్లికి చెందిన యువతి, యువకుడు కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే యువకుడు తాపీమేస్త్రీగా పనిచేస్తుండగా.. యువతి ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. ఇద్దరి కులాలు వేరు కావటంతో.. ఇంట్లో వారు పెళ్లికి నిరాకరిస్తారని భావించి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
ఆదివారం సాయంత్రం వీరిద్దరు ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఇరు కుటుంబాల వారు.. పిల్లల గురించి వెతుకుతున్నారు. సత్తెనపల్లి మండలం వెంకటపతి కాలనీ పొలాల్లో చెట్టుకు.. ఒకే చున్నీతో ఉరివేసుకుని కనిపించారు. యువతి తల్లి అక్కడకు చేరుకున్న రోధిస్తున్న తీరు అందరిని కలిచివేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.