గుంటూరు జిల్లాలో ఓ జంట ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. అచ్చంపేట మండలం నీలేశ్వరపాలేనికి చెందిన హనుమాన్ నాయక్‌కు వివాహమైనా... సత్తెనపల్లికి చెందిన మరో యువతితో కొంతకాలంగా వివాహేతర సంబంధం సాగించాడు. మూడు రోజుల క్రితం టీటీసీ పరిక్షలు రాసేందుకు కళాశాలకు వెళ్ళిన ఆ యువతి ఇంటికి తిరిగి రాలేదు. ఆందోళనకు గురైన ఆ యువతి తల్లిదండ్రులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలో.. శుక్రవారం అనూహ్యంగా ప్రియుడితో కలసి యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో హనుమాన్ నాయక్ మృతి చెందాడు. అమ్మాయి పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాలపై.. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వివాహేతర సంబంధం.. చివరికి ఆత్మహత్యాయత్నం! - గుంటూరు జిల్లాలో ఓ జంట ఆత్మహత్యాయత్నం
గుంటూరు జిల్లాలో కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఓ జంట.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
గుంటూరు జిల్లాలో ఓ జంట ఆత్మహత్యాయత్నం