ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ATTACK: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు..ఆ తర్వాత - Guntur district

గణపవరంలో ప్రేమ పెళ్లి వ్యవహారం వివాదానికి దారి తీసింది. ఈ క్రమంలో అమ్మాయి తరపు బంధువులు..నోములు చేసుకుంటున్న అబ్బాయి ఇంటికి వచ్చి దాడి చేశారు.

ప్రేమ పెళ్లి
ప్రేమ పెళ్లి

By

Published : Aug 11, 2021, 7:21 PM IST

గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో కులాంతర ప్రేమ పెళ్లి వ్యవహారం వివాదానికి దారి తీసింది. ప్రేమ వివాహం చేసుకున్న యువకుడిపై అమ్మాయి తరపు బంధువులు దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి.

గణపవరం గ్రామానికి చెందిన పొలిశెట్టి రవి అనే యువకుడు.. గుంటూరుకు చెందిన మహ్మద్​ షాహీనా అనే యువతి ఐదేళ్లుగా ప్రేమించుకున్నారు. ఇరువురు మేజర్లు కావటంతో వారం క్రితం పెద్దలకు తెలియకుండా వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత నాదెండ్ల పోలీస్ స్టేషన్​కు వెళ్ళి.. రక్షణ కల్పించాలని వేడుకున్నారు. దీంతో పోలీసులు ఇరు కుటుంబాలను పిలిచి కౌన్సిలింగ్​ చేసి పంపించారు.

ఇదిలా ఉంటే బుధవారం రవి ఇంటివద్ద నోములు జరుపుకుంటుండగా.. షాహీనా బంధువులు వచ్చి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇంటి అద్దాలు పగిలిపోవడంతో పాటు.. ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకొని గొడవను అదుపు చేశారు.

ప్రేమ పెళ్లి

ఇదీ చదవండి:అక్రమ కేసులు పెట్టేవారికి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details