గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం అల్లంవారిపాలెంలో వానరానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఓ వానరం రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టగా అక్కడికక్కడే మరణించింది. ఇది గమనించిన స్థానికులు తప్పెట్లతో.. పూలు చల్లుకుంటూ ఆ కోతికి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఓ పక్క గుంపులుగా ఉండటంతో కరోనా వ్యాపించి మనుషులు చనిపోతున్నారని పోలీసులు, అధికారులు చెబుతుంటే.. వీరు మాత్రం కోతికి అంతిమయాత్ర చేసిన తీరు ఆందోళనకు గురిచేస్తోంది.
వానరానికి అంత్యక్రియలా?.. మరీ ఇంత జనమా? - గుంటూరులో కోతికి అంత్యక్రియలు
లాక్డౌన్తో మనుషులు చనిపోయినా అంత్యక్రియలు నిర్వహించవద్దు. అలా చేస్తే గుంపులుగా ఉన్న జనంతో కరోనా వచ్చే ప్రమాదం ఉందని పోలీసులు, ప్రభుత్వాలు మొత్తుకుంటున్నాయి. ఇవేవీ వారికి పట్టలేదు. లాక్డౌన్ను ఏ మాత్రం పట్టించుకోలేదు. అందుకే చనిపోయిన వానరానికి అంత్యక్రియలు నిర్వహించారు. భారీగా జనం గుమిగూడారు.
lot of people are gathering without following lockdown for The monkey funeral at allavamvaripalem in guntur district