ఇసుక కోసం లారీ యజమానుల బారులు గుంటూరు జిల్లా పెదకాకాని పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన ఇసుక నిల్వ కేంద్రాల వద్ద వాహనాలు బారులు తీరాయి. కృష్ణా నది నుంచి సేకరించిన ఇసుకను పోలీస్ స్టేషన్ సమీపంలో నిల్వ చేశారు. ఆన్లైన్ ద్వారా ఇసుక బుక్ చేసుకున్న వారికి ఇక్కడ నుంచే సరఫరా చేస్తున్నారు. దీనివల్ల ఇక్కడికి పెద్ద ఎత్తున లారీలు తరలివచ్చాయి. జిల్లాలో 9 నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేయగా, కేవలం ఆరు కేంద్రాల్లో మాత్రమే ఇసుకను సరఫరా చేస్తున్నారు. వీటిలో పెదకాకాని నిల్వ కేంద్రం గుంటూరు నగరానికి సమీపంలో ఉండటంతో రద్దీ ఎక్కువగా ఉంది. మిగతా ఐదు తెనాలిలో ఉన్నా, అక్కడి నుంచి ఇసుక సరఫరాకు ఎక్కువ రవాణా ఛార్జీలు కావటంతో పెదకాకాని ఇసుక కేంద్రం వద్ద డిమాండ్ ఎక్కువగా ఉంది.
ఇదీ చదవండి: