ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లారీ ఢీకొట్టి వ్యక్తి మృతి - macherla latest news

ఆవులకు మేత వేసి... నీళ్లు పోసేందుకు పక్కకు వచ్చిన ఓ వ్యక్తిని... మృత్యువు లారీ రూపంలో వచ్చి ఢీకొట్టింది.

lorry hits a person
లారీ ఢీకొని వెంకయ్య మృతి

By

Published : Oct 1, 2020, 10:18 PM IST

మాచర్ల నియోజకవర్గం పాల్వాయి జంక్షన్​ గ్రామంలో పశువులను పోషిస్తూ జీవనం సాగిస్తున్న వ్యక్తి... లారీ ఢీకొట్టడం వల్ల మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి బెజవాడ వెంకయ్య(38)గా పోలీసులు గుర్తించారు. ఇంటి వద్ద ఆవులను పోషిస్తూ వెంకయ్య తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. గురువారం ఆవులకు మేత వేసి.. నీళ్లు పెడదామని కొంచెం పక్కకు వచ్చాడు.

హఠాత్తుగా అటుగా వచ్చిన లారీ అతన్ని ఢీకొట్టింది. కుటంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా... మార్గమధ్యంలో అతను మృతి చెందాడు. వెంకయ్యకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details