గుంటూరు జిల్లాలోని రొంపిచర్ల వద్దనున్న నార్కట్పల్లి - అద్దంకి హైవేలోని తంగేడుమల్లి మేజర్ కాల్వ వద్ద లారీ డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడు ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామానికి చెందిన నారపరెడ్డి సుధాకర్ రెడ్డి (35)గా గుర్తించారు. ఒంగోలు నుంచి హైదరాబాద్కు సుధాకర్ రెడ్డి లారీ నడుపుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో నార్కట్పల్లి - అద్దంకి హైవేలోని తంగేడుమల్లి మేజర్ కాల్వ వద్దకు చేరుకునే సమయానికి హఠాత్తుగా గుండెపోటు రావటంతో లారీ అదుపుతప్పి పక్కనే ఉన్న పొల్లాలోకి దూసుకెళ్లింది. స్థానికులు లారీ వద్దకు చేరుకుని చూడగా డ్రైవర్ మృతి చెందినట్లు గమనించారు. వెంటనే రొంపిచర్ల పోలీసులకు సమాచారమిచ్చారు.
గుండెపోటుతో లారీ డ్రైవర్ మృతి - గుంటూరు జిల్లా తాజా సమాచారం
గుండెపోటుతో లారీడ్రైవర్ మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లాలోని నార్కట్ పల్లి-అద్దంకి రహదారిలో జరిగింది. మృతుడు ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
గుండెపోటుతో లారీ డ్రైవర్ మృతి
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతుని బంధువులకు సమాచారమిచ్చారు. మృతదేహాన్ని నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి