గుంటూరు జిల్లాకు చెందిన ఓ కళాకారుడు రావి ఆకుపై వినాయకుని చిత్రాన్ని రూపొందించారు. తెనాలి మండలం పెదరావూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చిత్రకళ ఉపాధ్యాయునిగా పని చేస్తున్న పణిదెపు వెంకటకృష్ణ రావి ఆకుపై గణేశుడి చిత్రాన్ని చిత్రీకరించారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించాలని కోరుకుంటూ... ఈ చిత్రాన్ని రూపొందించినట్లు వెంకటకృష్ణ తెలిపారు.
రావి పత్రంపై ఏకదంతుడి చిత్రం - గుంటూరులో వినాయక చవితి వేడుకలు
ఆదిదేవుడిపై తనకున్న భక్తిని వినూత్నంగా చాటాడు గుంటూరుకు చెందిన ఓ కళాకారుడు. రావి చెట్టు ఆకుపై వినాయకుడి చిత్రాన్ని చిత్రించి ఔరా అనిపించుకున్నాడు.
![రావి పత్రంపై ఏకదంతుడి చిత్రం lord vinayaka art on ravi tree in guntur district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8507727-1098-8507727-1598022049913.jpg)
రావి పత్రంపై ఏకదంతుడి చిత్రం