మందడంలో బయటి వ్యక్తులు డ్రోన్ ఎగురవేశారని నారా లోకేశ్ అన్నారు. గుంటూరు జిల్లా జైలులో ఉన్న రాజధాని రైతులను ఆయన పరామర్శించారు. ఆయనతోపాటు తెదేపా నేతలూ ఉన్నారు. డ్రోన్‌ను అడ్డుకునేందుకు వెళ్లిన రైతులపై కేసులు నమోదు చేశారని లోకేశ్ ఆరోపించారు. ఇళ్ల స్థలాల పేరుతో పేదల భూములు లాక్కుంటున్నారని మండిపడ్డారు.
గుంటూరు జిల్లా జైలుకు నారా లోకేశ్.. ఎందుకంటే? - గుంటూరు జిల్లా జైలుకు నారా లోకేశ్ న్యూస్
300 మంది పులివెందుల రౌడీలను తెచ్చి విశాఖలో చంద్రబాబును అడ్డుకున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. రైతలు ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
lokesh visit gunturu distric jail