ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వాస్తవాలు తెలుసుకోండి కన్నా : లోకేశ్ - tana 22 sabhalu

అమెరికా తానా సభల్లో జరిగిన ఓ వివాదాన్ని తనకు ఆపాదించి మాట్లాడడం సరికాదని లోకేశ్...భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నాకు హితవు పలికారు. ఎవరో కన్నాకు తప్పుడు సమాచారం ఇచ్చారని, వాస్తవాలు తెలుసుకోవాలని కోరారు.

వాస్తవాలు తెలుసుకోండి కన్నా : లోకేశ్

By

Published : Jul 10, 2019, 9:45 AM IST



అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జరిగిన తానా 22వ సభల్లో జరిగిన ఓ వివాదానికి..భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ తనను బాధ్యుడిని చేయడం ఆశ్చర్యం కలిగించిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ అన్నారు. సీనియర్ రాజకీయ నాయకులైన కన్నా ఇలా వ్యాఖ్యానించారంటే, జరిగిన దానిని వక్రీకరించి ఎవరో కన్నాకు తప్పుడు సమాచారం ఇచ్చి ఉంటారని లోకేశ్ ట్విటర్​లో అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు.

ABOUT THE AUTHOR

...view details