దేశానికి రక్షణ కల్పించే సైనికులకు కూడా రాష్ట్రంలో రక్షణ లేకపోవటం జగన్ రెడ్డి దుర్మార్గపు పాలన, అరాచకాలకు అద్దంపడుతోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దుయ్యబట్టారు. నరసరావుపేటలో జరిగిన ఘటన జగన్ విధ్వంస మనస్తత్వానికి పరాకాష్ఠ అని ఆయన మండిపడ్డారు. 18 ఏళ్ళు దేశ సరిహద్దులో సేవలందించి కష్టపడిన డబ్బుతో నరసరావుపేటలో స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకుంటే వైకాపా నేతలు, అధికారులు కలిసి ఆ ఇంటిని కూల్చేశారని ధ్వజమెత్తారు. నష్టపోయిన సైనికుడి కుటుంబానికి న్యాయం చేయటంతో పాటు ఇల్లు కూల్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సైనికుడి ఆవేదనకు సంబంధించిన ఓ వీడియోను తన ట్వీటర్ ఖాతాకు జత చేశారు.
'దేశానికి రక్షణ కల్పించే సైనికులకు రాష్ట్రంలో రక్షణ లేదా?' - లోకేశ్ తాజా ట్వీట్
దేశానికి రక్షణ కల్పించే సైనికులకు కూడా రాష్ట్రంలో రక్షణ లేకపోవటం దుర్మార్గమని తెదేపా నేత నారా లోకేశ్ వ్యాఖ్యనించారు. 18 ఏళ్ళు దేశ సరిహద్దులో సేవలందించి కష్టపడిన డబ్బుతో ఓ సైనికుడు నరసరావుపేటలో స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకుంటే వైకాపా నేతలు, అధికారులు కలిసి ఆ ఇంటిని కూల్చేశారని ధ్వజమెత్తారు.
దేశానికి రక్షణ కల్పించే సైనికులకు రాష్ట్రంలో రక్షణ లేదా?