రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామంటే... రైతుల పంటను బ్యాంకులు వేలం వెయ్యడమని ఆలస్యంగా అర్ధమయ్యిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. జగన్ రెట్టింపు చేసింది రైతుల ఆదాయం కాదు... ఆవేదన అని ధ్వజమెత్తారు. పంటని తక్కువ ధరకు అమ్మాల్సి వస్తే... ప్రభుత్వమే కొంటుందని జగన్ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. అప్పు తీర్చలేదని గోదాంలో ఉన్న శనగ నిల్వలను బ్యాంకులు వేలం వేస్తుంటే... జగన్ నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలస్యం ఎందుకూ... ఆర్థికమంత్రి బుగ్గనకి ఒక ఫోన్ కొట్టండి... గాలి పోగేసి వేలానికి చంద్రబాబు కారణం అంటూ ఒక లేఖ తయారు చేస్తారని ఎద్దేవా చేశారు.
జగన్ నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు: లోకేశ్ - nara lokesh
వైకాపా ప్రభుత్వంపై నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా మరోసారి ధ్వజమెత్తారు. రైతుల పంటలు బ్యాంకులు వేలం వేస్తుంటే సీఎం జగన్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
జగన్ నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు: లోకేశ్