రాజధాని అమరావతి నిర్మాణానికి,ప్రభుత్వం వద్ద నిధులు లేవని ఆర్ధిక మంత్రి బుగ్గన రాంజేంద్రనాథ్ రెడ్డి పేర్కొనడం దారుణమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు.సింగపూర్ కు వెళ్లి మరీ చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు.రాజధానిని నిర్మించడం తమకు ఇష్టం లేదని చెప్పినా బాగుండేదని ఎద్దేవా చేశారు.ప్రధాని దగ్గరకు వెళ్ళి రాజధాని నిర్మాణానికి నిధులు అవసరం లేదని ప్రధానికి,సిఎం జగన్ చెప్పిన సంగతి బుగ్గనకు గుర్తురాలేదా అని ట్విట్టర్ వేదికగా లోకేష్ ప్రశ్నించారు..
సింగపూర్ వెళ్లి.. అమరావతి కట్టలేమని చెప్పొస్తారా..? - లోకేష్ ట్వీట్
అమరావతి నిర్మాణానికి నిధుల్లేవని అనడం సిగ్గుచేటని నారా లోకేష్ ట్వీట్ చేశారు. నిధులు లేవని చెప్పడం కంటే, రాజధాని నిర్మాణం ఇష్టం లేదని చెప్పినా బాగుండేదని ఎద్దేవా చేశారు.
రాజధాని నిర్మాణానికి నిధుల్లేవనటంపై లోకేష్ ట్వీట్
Last Updated : Sep 12, 2019, 4:42 PM IST